చంద్రబాబుతో భేటీ.. ఎంవోయూ కుదుర్చుకున్న 'అలీబాబా' ప్రతినిధులు

  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం
  • రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు
  • రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఎంవోయూ
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం 'అలీబాబా' కూడా ఏపీ పట్ల మొగ్గు చూపింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో అలీబాబా సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు అలీబాబా క్లౌడ్ లిమిటెడ్ ఎంవోయూ కదుర్చుకుంది. ఈ సంస్థ అలీబాబా గ్రూపులో ఓ విభాగం.
Go Back to Shorts
chandrababu
alibaba
mou

More Telugu News